తెలంగాణలో దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరా నవరాత్రులు తెలంగాణలో అమ్మవారి పూజలు, బతుకమ్మ పండుగ వాతవరణ శోభయామనంగా విరాజిల్లుతుంది. అయితే.. ఉద్యోగ, ఇతరవసరాల నిమిత్తం పట్నంలో ఉంటూ దసరాకు ఊరికెళ్లే వారికోసం ప్రతిసంవత్సరం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి ఆయా విభాగాలు. అయితే..ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 నుంచి వచ్చే నెల 7వరకు దసరా నవరాత్రులో అత్యంత వైభవంగా సాగనున్నాయి. అయితే.. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు అంతంత మాత్రంగానే దసరా పంగుడ ఉత్సవాలు జరిగాయి.
అయితే.. ఈ సంవత్సరం పండుగను వైభవోపేతంగా జరుపుకునేందకు తెలంగాణ వాసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 3,500 బస్సులను స్పెషల్‌గా జిల్లాలకు నడిపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆర్టీసీ అధికారుల. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్టీసీ రంగారెడ్డి అధికారి నుంచి అనుమతి కోసం సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం.