అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీ రామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా.. రాంలల్లా జన్మదినోత్సవం ఈనెల 17 నుంచి జరుగనుంది. అందుకోసం ఆలయ ట్రస్ట్ అధికారులు పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా కొత్తిమీర తరుగుతో కూడిన ప్రసాదాన్ని ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.
రాంలల్లా జన్మదినోత్సవంలో భక్తులకు పంచిపెట్టే ప్రసాదం కొత్తిమీర పంజిరీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది భోగ్ తర్వాత శ్రీరాముడికి మాత్రమే నైవేధ్యంగా పెడుతారు. అయితే.. రాంలల్లా జన్మదినోత్సవం పురస్కరించుకుని 10 క్వింటాళ్లకు పైగా పంజిరీని తయారు చేస్తున్నారు. దీంతో పాటు.. పెద్ద మొత్తంలో లడ్డూలు, పేలాలు కూడా పంపిణీ చేయనున్నారు. పంజీరితో పాటు.. పంచమేవ, రామదాన మొదలైనవి ప్రసాదంగా భక్తులకు ఇవ్వనున్నారు. మొత్తం ప్రసాదం కలిపి 40 క్వింటాళ్ల వరకు సిద్ధం చేస్తున్నారు.
UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
కాగా.. రాంలల్లాకు నైవేధ్యంగా చప్పన్ భోగ్ అందించనున్నారు. మరోవైపు భక్తులకు పంచామృతాన్ని ప్రసాదంగా ఇవ్వనున్నారు. మధ్యాహ్నం సమయాన రామజన్మ వేడుకల అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. రామజన్మోత్సవాన్ని అత్యంత ఘనంగా, ఉత్సాహంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాంలల్లా జన్మదినోత్సవం వేడుకలు పురస్కరించుకుని.. కొన్ని రోజుల నుంచి సాయంత్రం వేళల్లో సోహార్, భజన తదితర ప్రదర్శనలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు.. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు రాంలల్లా దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, ట్రస్ట్ సంయుక్తంగా సన్నాహాలు చేశాయి. ఏడు లేన్ల నుంచి దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. క్యూలో ఉన్న భక్తులకు నీరు, ప్రసాదం అందించేందుకు కృషి చేస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు.. సేవా ఆతిథ్యం అందించేందుకు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకొచ్చారు. నగరంలో 20కి పైగా చోట్ల తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. శిబిరం గుండా వెళ్లే భక్తులకు నీరు తాగాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శిబిరాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.