వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కొందరు యువతులు పాడిన పాటల వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటన మార్చి 12న సదరన్ రైల్వే ట్విట్టర్ ( X )లో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో వైరల్ అయింది. కానీ సోషల్ మీడియా వినియోగదారులు పూర్తిగా దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రయాణ సమయంలో “చిరాకు” తప్ప మరేమీ రాదని పేర్కొన్నారు.
Read Also: Amazon Forest: బ్రెజిల్ లో కార్చిచ్చుల బీభత్సం..!
చెన్నై నుంచి మైసూరుకు ప్రయాణిస్తున్నప్పుడు దాదాపు 12 మంది యువతులు ఈ సంగీత కచేరిని మనం ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో యువతులు తమ మధురమైన పాటలతో తమ ప్రయాణాన్ని ఆనందకరంగా మార్చుకునేందుకు సంగీతాన్ని ఎంపిక చేసుకున్నారు అంటూ దక్షిణ రైల్వే ఎక్స్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేసి శీర్షికను చేర్చింది. ఇక, ఈ పోస్టుపై నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధికారిక పేజీలో వీడియోను “ప్రమోట్” చేసుకునేందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దంటూ దక్షిణ రైల్వేపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ వీడియోకు విభిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. రైల్వే బోర్డు ప్రజల ఇబ్బందిని ఎందుకు ప్రోత్సహిస్తుందని నెటిజన్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
🚄🎶 A symphony of joy aboard the #Chennai – #Mysuru Vande Bharat Express! 💃✨
Witness the enchanting moments as these young ladies turn their journey into a delightful musical escapade with their sweet songs.#SouthernRailway #VandeBharat #VandeBharatExpress pic.twitter.com/BuiwzxZnz3
— Southern Railway (@GMSRailway) March 12, 2024