రన్నింగ్ ట్రైన్ ఎక్కడం గానీ.. దిగడం గానీ ప్రమాదం అని రైల్వేస్టేషన్లలో అనౌన్సెమెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు ప్రయాణికులు పెడచెవిన పెడుతూనే ఉంటారు. ఇందుకు మూల్యంగా ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కొందరు యువతులు పాడిన పాటల వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.