South India Shopping Mall: కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుభారంభం..
- కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూం ప్రారంభం
- సినీతారలు పాయల్ రాజ్ పుత్
- నేహా శెట్టి చేతుల మీదుగా ఓపెనింగ్
- ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగూడెంలో 36వ షోరూంను ప్రారంభించించింది. స్థానికంగా కొత్తగూడెం.. పరిసరాలలోను నివసించే వారి సరికొత్త జీవన శైలికి, వ్యక్తిగత అభిరుచులకు అచ్చంగా సరితూగే షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో.. సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని సైతం అందించగలదు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొత్తగూడెం పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి సీతామహాలక్ష్మి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు కె. చంద్ర శేఖర రావు, విద్యానగర్ మాజీ సర్పంచ్ బానోత్ గోవింద్, చుంచుపల్లి మాజీ ఎంపిపి బడావత్ సుగుణ ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు.

Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ప్రముఖు సినీ తారలు నేహా శెట్టి, పాయల్ రాజ్ పుత్ దీప ప్రజ్వలనతో శుభప్రదమైన ఆరంభానికి శ్రీకారం చుట్టారు. కొత్తగూడెం స్థానిక కస్టమర్స్‌కు ఆరంభ ఆఫర్‌గా అన్ని వెరైటీల పైన కాస్ట్-టు-కాస్ట్ సేల్‌ను ఆవిష్కరించారు. అనంతరం.. సినీ తార నేహా శెట్టి మాట్లాడుతూ, షోరూమ్‌లో అన్ని వయసుల, తరాల అభిరుచులకు సరితూగే విస్తృత శ్రేణికి చెందిన కలెక్షన్స్ ఉంటాయని చెప్పింది. “కొత్తగూడెంలో సౌత్ ఇండియా షోరూమ్ ఆవిష్కరణలో భాగం కావడం విస్మయం గొలిపే అనుభవం. వస్త్రాలంకరణకు సంబంధించి మంచి అభిరుచులు కలిగిన కొత్తగూడెం వాసులు.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఈ సరికొత్త షోరూమ్‌లో లభించే విస్తృత శ్రేణికి చెందిన వస్త్రాలతో రాబోయే పండగలు, వివాహ వేడుకలను సంతోషంగా జరుపుకొంటారని, ఇక్కడ లభించే ఆఫర్లను వినియోగించుకుని, అనేక ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను.” అన్నారు. పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో చిరకాల అనుబంధాన్ని, అనేక పర్యాయాలు సందర్శించిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. “ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్లను, విలాసవంతమైన పోకడలను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థ కస్టమర్లకు చేరువ కావటంలో ఎప్పుడూ ముందుంటుంది. వివాహం, పండగ, పూజ.. ఏ వేడుకైనా అచ్చంగా సరిపోయే వెరైటీలు ఇక్కడ లభిస్తాయి. కొత్తగూడెం వస్త్రప్రియులు ఈ మాల్‌ను తప్పక సందర్శించి, మీ సరికొత్త అభిరుచులకు సరిపడే వస్త్ర శ్రేణిని పొందండి” అని అన్నారు.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ.. శుభారంభానికి విచ్చేసిన ప్రముఖులకూ, పెద్దలకూ, సందర్శకులకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని అందించడంలో తమ అంకితభావాన్ని, నిబద్ధతను వివరించారు. “రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వస్త్రాభరణాల విషయంలో వినియోగదారుల సంతృప్తికి అగ్ర తాంబూలం ఇస్తామని, అందుకే వారి విశ్వసనీయతను చూరగొన్నామని, అదే తమ సంస్థ విజయ రహస్యమని అన్నారాయన. ముఖ్యంగా నాణ్యత, సరసమైన ధరల విషయంలో మొత్తం రీటైల్ పరిశ్రమలో అగ్రశ్రేణిలో ఉండటం తమకు గర్వకారణమని, అందుకు వస్త్ర ప్రియులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సురేశ్ శీర్ణ అన్నారు. దసరా, దీపావళి వేడుకల సందర్భంగా అన్ని రకాల వెరైటీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నామని, వినియోగదారులు సంతోషంగా ముందుకు వచ్చి ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.

సంస్థ మరో డైరెక్టర్ అయిన శ్రీ అభినయ్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పట్టు విభాగంలో లభించే వెరైటీల విస్తృత శ్రేణి గురించి వివరించారు. ” పట్టు గురించి అత్యంత అనుభవం, పరిజ్ఞానం, సేకరణ నైపుణ్యం కలిగిన మా బృందంచే సభ్యులు భారతీయుల ఫ్యాషన్ ట్రెండ్స్‌ని లోతుగా అధ్యయనం చేశారు. అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవన శైలిని మేళవించి.. కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల వెరైటీలను మా షారూమ్స్లో అందుబాటులో ఉంచాం” అని తెలిపారు. డైరెక్టర్ రాకేశ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో కొత్తగూడెం షోరూమ్ తాలూకు ప్రత్యేకత గురించి వివరించారు. ఎత్నిక్ మరియు బ్రాండెడ్ ఆప్షన్స్ విషయంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుంటుందని అన్నారు. మెన్స్ వేర్లో తమ వద్ద విస్తృత శ్రేణికి చెందినా కలెక్షన్స్ ఉన్నాయని, కొత్తగూడెం వాసులు తప్పక సందర్శించి, కొనుగోలు చేయగలరని రాకేశ్ స్వాగతించారు. కేశవ్ మాట్లాడుతూ.. తమ షోరూమ్‌లోని చూడిదార్, లేహంగాలు లేగ్గింగ్స్, గౌన్లు, కిడ్స్ వేర్, బ్రాండెడ్ లేడీ వేర్స్ లాంటి విస్తృతమైన వెరైటీలు ఇప్పటి ఫ్యాషన్స్‌కు అనుగుణంగా రూపొందాయని అభిరుచి కలిగిన మహిళా కస్టమర్లను స్వాగతిస్తున్నాయని అన్నారు. కొత్తగూడెం వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36 వ షోరూమ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా ముగిసిందని తెలిపారు.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!