Sourav Ganguly: “ముందుంది ముసళ్ల పండుగ”.. విక్టరీ జోష్‌లో ఉన్న కోచ్ గంభీర్‌కు గంగూలీ హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు టీ20 వరల్డ్ కప్పులను సొంతం చేసుకున్న ప్రపంచంలోని ఏకైక టీమ్‌గా అవతరించింది. మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హెడ్ కోట్ గౌతమ్ గంభీర్‌కు ఇదో మంచి పరిణామం. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న తొలి భారత హెడ్ కోచ్‌గా గంభీర్ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచుల్లో గంభీర్ వ్యూహాలు బాగా పని చేశాయి. అయితే.. ఈ జోష్‌లో ఉన్న టీమిండియాకు మాజీ కెప్టె్ సౌరవ్ గంగూలీ హెచ్చరికలు జారీ చేశారు. ముందుంది ముసళ్ల పండుగ అనే రీతిలో సూచనలు చేశారు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్పుతోనే అసలైన సవాలు మొదలు కానుందని వెల్లడించారు. “గంభీర్ అసలు సిసలైన సత్తా సౌతాఫ్రికా గడ్డపై బయటపడుతుంది. దక్షిణాఫ్రికాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆ పరిస్థితులు టీమ్‌ను, కోచ్‌ను సవాల్ చేస్తాయి. ప్రస్తుతం టీమిండియా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ జట్టుతో గంభీర్ ఆ సవాల్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడనిపిస్తోంది. గంభీర్‌పై నాకు నమ్మకం ఉంది.” అని గంగూలీ పేర్కొన్నారు.
READ MORE: Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
గంభీర్ కేవలం టీ20, వన్డేలే కాకుండా టేస్టు్లోనూ తనదైన ముద్ర వేయాలని గంగూలీ సచించారు. రెడ్ బాల్ క్రికెట్‌లో మెరుగు పడాలన్నారు. టర్నింగ్ పిచ్‌ల మీద మాత్రమే ఆడాలనే ఆలోచనను పక్కన పెట్టి, మంచి వికెట్లపై ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని హితవు పలికారు. గంభీర్ కోచ్ ప్రతిభను సమర్థిస్తూ.. కోచ్‌గా పూర్తి స్థాయిలో నిరూపించుకోవడానికి కొంత సమయం కావాలని సూచించాడు. మరోవైపు.. గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్పుపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాడు. ఈ వన్డే వరల్డ్ కప్పు రోహిత్ శర్మ, కోహ్లీలకు కీలకంగా మారనుంది. ఎందుకంటే.. ఈ సీజన్ తర్వాత వీళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరు దిగ్గజాలను ఈ వరల్డ్ కప్పులో యూజ్ చేసుకునేందుకు బీసీసీఐ ప్రణాళిక ప్రారంభించింది. ఇక గంభీర్ అద్భుతమైన వ్యూహం తోడైతే ఈ కప్పుపై ఆశలు చిగురిస్తాయి.
READ MORE: Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!