Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తొలగించబోతున్నారన్న వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు. గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను టెస్టు కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందన్న మీడియా కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.