Sourav Ganguly On Rinku Singh T20 World Cup 2024 Snub: టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ప్రకటించిన భారత జట్టు గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన జట్టునే ఎంపిక చేశారన్నారు. వెస్టిండీస్ పిచ్‌లు కాబట్టి సెలక్టర్లు అదనంగా ఓ స్పిన్నర్‌ను ఎంపిక చేసి ఉంటారని, అందుకే రింకు సింగ్‌కు అవకాశం దక్కి ఉండకపోవచ్చని దాదా అభిప్రాయపడ్డారు. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 30న ప్రకటించిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ‘వెస్టిండీస్ పిచ్‌లు మందకొడిగా ఉంటాయి. అందుకే బీసీసీఐ సెలక్టర్లు అదనంగా మరొ స్పిన్నర్‌ను ఎంపిక చేసుంటారు. అందుకే రింకు సింగ్‌కు అవకాశం దక్కలేదు. రింకు ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుస్తున్నాడు. అతడికి భవిష్యత్తులో తప్పకుండా అవకాశం వస్తుంది. భారత్ ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. అందరూ మ్యాచ్ విన్నర్లే. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారు’ అని గంగూలీ అన్నారు.
Also Read: Pawan Kalyan: నాకు కొడాలి నానిని తిట్టాలని ఏమీ లేదు.. కానీ..!
‘టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ రేసులో భారత్, ఆస్ట్రేలియా ముందుంటాయని నేను అనుకుంటున్నా. వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్‌లో ఈ రెండు జట్లే తలపడ్డాయి. భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శిస్తాయి’ అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి.