Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sourav Ganguly Calls India Vs Pakistan Asia Cup 2025 Match Boring

Sourav Ganguly: చప్ప, చప్పగా.. సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

Published Date :September 16, 2025 , 2:38 pm
By Sampath Kumar
  • భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ చప్ప, చప్పగా
  • మ్యాచ్‌పై గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
  • పాకిస్థాన్‌ కనీస పోటీ ఇవ్వడం లేదు
Sourav Ganguly: చప్ప, చప్పగా.. సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌ అంటే హోరాహోరీగా పోరు ఉంటుంది. ప్రతిక్షణం ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, బంతి బంతికి మలుపులు, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్‌ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. ఇండో-పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. మ్యాచ్ చప్పగా సాగడంతో చాలామంది ఫాన్స్ పూర్తి మ్యాచ్ చూడలేదు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే చేశారట.

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ మీద పెద్దగా ఆసక్తి కలగలేదని, తాను మొదటి 15 ఓవర్లు మాత్రమే చూశానని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. మ్యాచ్ బోర్ కొట్టి ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ వీక్షించానని దాదా చెప్పారు. ‘నిజానికి నేను భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను మొదటి 15 ఓవర్లు చూశాను. బోర్ కొట్టి ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ను చూశా. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌ కనీస పోటీ ఇవ్వడం లేదు. మ్యాచ్‌లు అన్ని ఏకపక్షంగా సాగుతున్నాయి. ఇండో-పాక్ మ్యాచ్‌ల కంటే భారత్‌.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్, శ్రీలంక మ్యాచ్‌లు ఆసక్తిగా ఉంటున్నాయి. చివరకు భారత్‌, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పుడు భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు హైప్‌ అవసరం లేదు’ అని దాదా అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Gardening Tips: ఇంటి గార్డెన్‌లో ఈ 5 పండ్ల మొక్కలను నాటండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి!

‘పాకిస్థాన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. పాక్ జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ లేరు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా పస లేదు. పాకిస్థాన్‌ జట్టులో నాణ్యత కొరవడింది. ఉన్న ఒకరిద్దరు కూడా విఫలమయ్యారు. మరోవైపు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్స్ లేకున్నా భారత్ టోర్నీలో బాగా రాణిస్తోంది. ఆసియా కప్‌ 2025లో భారత్ అన్ని జట్ల కంటే ఎంతో ముందంజలో ఉంది. టీమిండియా ఎప్పుడూ బెస్ట్‌ టీమ్‌’ అని సౌరవ్ గంగూలీ ప్రశంసించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia Cup 2025
  • ind vs pak
  • India vs Pakistan
  • Sourav Ganguly
  • Sourav Ganguly Pakistan

తాజావార్తలు

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions