Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sorakaya Kadhi Recipe: భారతీయ వంటకాలలో కడీకి ప్రత్యేక స్థానం ఉంది.. పంజాబీ కడీ, గుజరాతీ కడీ, రాజస్థానీ కడీ వంటి ఎన్నో రకాల కడీలు ప్రజాదరణ పొందాయి. అయితే ఆరోగ్యకరమైన, తేలికపాటి మరియు రుచికరమైన వంటకం కావాలనుకుంటే సొరకాయ కడీ ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. సాధారణంగా చాలామందికి సొరకాయ అంటే అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కడీ రూపంలో తయారు చేస్తే దాని రుచి పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మధ్యాహ్న భోజనానికి తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే ఈ సొరకాయ కడీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
కావలసిన పదార్థాలు
* చిన్న సొరకాయ – 1 (తొక్క తీసి తురిమినది)
* పెరుగు – 500 గ్రాములు
* శనగపిండి – 1 టేబుల్ స్పూన్
* నీరు – 2 గ్లాసులు
* నూనె – 1 టేబుల్ స్పూన్
* ఆవాలు – 1 టీస్పూన్
* ఇంగువ – చిటికెడు
* పచ్చిమిరపకాయలు – 2 నుంచి 3
* నెయ్యి – 1 టీస్పూన్
* ఎండు మిరపకాయలు – 2
* మెంతులు – 1/4 టీస్పూన్
* జీలకర్ర – 1 టీస్పూన్
* కరివేపాకు – 8 నుంచి 10 ఆకులు
* వెల్లుల్లి రెబ్బలు – 3 నుంచి 4
* కసూరి మెంతి – 1 టీస్పూన్
* పసుపు – 1/2 టీస్పూన్
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* కారం పొడి – 1/2 టీస్పూన్
* గరం మసాలా – 1/2 టీస్పూన్
* ఉప్పు – తగినంత
* కొత్తిమీర – అలంకరణకు
* ఆమ్చూర్ పొడి – 1/2 టీస్పూన్
Also Read
- Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్‌గా ఉండాలా..? ప్రోటీన్ పవర్‌తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్‌గా తయారు చేయండి..
- Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
తయారీ విధానం
ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. ఒక లోతైన బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి తాలింపు వేయాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత తురిమిన సొరకాయను వేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును బాగా గిలకొట్టి, అందులో శనగపిండిని కలపాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత నీరు పోసి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని సొరకాయ ఉన్న బాణలిలో పోసి బాగా మరిగించాలి. మంటను తగ్గించి మరో చిన్న బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు మిరపకాయలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయాలి. తరువాత వెల్లుల్లి, కసూరి మెంతి, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు వేసి మసాలాల సువాసన వచ్చే వరకు వేయించాలి. ఈ తాలింపును కడీలో కలిపి మరో 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర మరియు కొద్దిగా ఆమ్చూర్ పొడి చల్లి దింపేయాలి.
ఏంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన వంటకం
ఈ సొరకాయ కడీ వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది. జీరా రైస్, ఫుల్కాలు, మిల్లెట్ రోటీలు లేదా ఖిచిడీతో కూడా వడ్డించవచ్చు. తక్కువ నూనెతో, ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారయ్యే ఈ వంటకం కుటుంబ సభ్యులందరికీ నచ్చే అవకాశం ఉంది.. ఇంకా ఆలస్యమెందుకు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ సొరకాయ కడీని మీరూ ట్రై చేయండి…
తాజావార్తలు
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!