Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Municipal Corporation: విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను 86 డివిజన్లుగా విస్తరిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర.. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగర ప్రజలు తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ పునర్విభజనలో ముఖ్యంగా విజయవాడ తూర్పు ప్రాంతంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న 21 డివిజన్లను 29 డివిజన్లుగా పెంచుతున్నారు. సర్కిల్-3 పరిధిలో ఎనిమిది కొత్త డివిజన్లు ఏర్పాటు చేయడం ద్వారా కీలక మార్పులు చేపడుతున్నారు.
కొత్త డివిజన్ల ప్రకారం 2వ డివిజన్ నుంచి 30వ డివిజన్ వరకు సరిహద్దులను పునర్నిర్వచించారు. ఈ డివిజన్ సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా సౌలభ్యం మరియు అభివృద్ధి పనుల సమర్థ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని డివిజన్ల సంఖ్య పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్..
Also Read
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!