Sattu Chaas Recipe: మండుటెండలో కూల్‌గా ఉండాలా..? ప్రోటీన్ పవర్‌తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్‌గా తయారు చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sattu Chaas Recipe: వేసవి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇక, ఉదయాన్నే ఆఫీసుకు వచ్చేవారు.. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లాలంటే వణికిపోతున్నారు.. మండే ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలంలో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం వల్ల అలసట, తల తిరగడం, గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు శక్తినిచ్చే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.
అలాంటి ఆరోగ్యకరమైన సంప్రదాయ పానీయాల్లో ‘సత్తు ఛాస్’ ఒకటి. వేయించిన శనగలతో తయారయ్యే సత్తులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. మరోవైపు మజ్జిగ శరీరానికి తేమను అందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రెండింటి కలయిక వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది.
Also Read
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
సత్తు ఛాస్ తయారీకి కావలసిన పదార్థాలు
* వేయించిన శనగపిండి (సత్తు) – 3 టేబుల్ స్పూన్లు
* తాజా పెరుగు లేదా మజ్జిగ – 1 పెద్ద గ్లాసు
* చల్లటి నీరు – అర గ్లాసు
* పుదీనా ఆకులు – 8 నుంచి 10
* పచ్చిమిర్చి – 1 టీస్పూన్ (ఐచ్ఛికం)
* వేయించిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్
* నల్ల ఉప్పు – అర టీస్పూన్
* నిమ్మరసం – 1 టీస్పూన్
* ఐస్ క్యూబ్స్ – అవసరమైనంత
తయారీ విధానం:
ముందుగా పెరుగును ఉపయోగిస్తే దానిలో కొద్దిగా నీరు కలిపి మజ్జిగలా చిలకాలి. మజ్జిగను నేరుగా ఉపయోగిస్తే చాలు. ఇప్పుడు అందులో సత్తు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, సన్నగా తరిగిన పుదీనా ఆకులు, పచ్చిమిర్చి మరియు నిమ్మరసం వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసి తయారుచేసుకున్న సత్తు ఛాస్ పోయాలి. పైగా కొద్దిగా జీలకర్ర పొడి, పుదీనా ఆకులతో అలంకరిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఈ సత్తు ఛాస్ను ఉదయం అల్పాహారంతో పాటు లేదా ఎండలో బయటకు వెళ్లే ముందు తీసుకుంటే శరీరం చల్లగా ఉండటంతో పాటు డీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఆరోగ్యకరమైన ఈ సంప్రదాయ పానీయం వేసవిలో మీ శరీరానికి శక్తినిచ్చే ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!