Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ‘మ్యాస్ట్రో’గా, సంగీత ప్రపంచపు సార్వభౌముడిగా వెలుగొందుతున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) పేరు కోలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా పలు కాపీరైట్ వివాదాలు, లీగల్ నోటీసుల వల్ల వార్తల్లో నిలిచిన ఇళయరాజా.. తాజాగా సూర్య – త్రిష కాంబినేషన్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బ్లాక్‌బస్టర్ హిట్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) వివాదంలోకి లాగబడ్డారు. ఈ నేపథ్యంలో..
చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ఇళయరాజాకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమా సెకండాఫ్ (Second Half) లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో ఇళయరాజాను ఉద్దేశించి వచ్చే ఒక డైలాగ్ పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సీన్ రాజా స్థాయికి ఎంతో అనుచితంగా, ఆయనను కించపరిచేలా ఉందంటూ ఇటు ఇళయరాజా అభిమానుల నుండి, అటు సినీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివాదం ముదురుతోందని గ్రహించిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు..
Also Read
- 'Dada' : 'దాదా' ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
‘మా ‘కరుప్పు’ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఒక సన్నివేశంలో మ్యాస్ట్రో ఇళయరాజా గారి ప్రస్తావన వస్తుంది. అయితే, ఆ సీన్‌ను మేము కేవలం హాస్యం (సందర్భోచితం) కోసమే రాసుకున్నాము తప్ప.. కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఇళయరాజా గారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ సీన్ వల్ల రాజా గారి మనోభావాలు, అలాగే ఆయన అభిమానుల మనసులు నొచ్చుకున్నందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు (Apology) కోరుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాము’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
#Pressrelease #PublicAnnouncement #Karuppu #MaestroIlayaraaja pic.twitter.com/hdgP3wZhBL
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 19, 2026
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి