స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో లగ్జరీ డిజైన్.. కొత్తగా రాబోతున్న Motorola Edge 70 Swarovski Edition..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 70 Swarovski Edition: మోటరోలా మరోసారి లగ్జరీ, స్టైల్‌ను కలగలిపిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉంది. ఇటీవల విడుదలైన Motorola Edge 70 తరువాత, ఇప్పుడు దాని ప్రత్యేకమైన Swarovski Edition సంబంధించి ఫోటోలు లీక్ కావడంతో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. లీక్ అయినా ప్రమోషనల్ పోస్టర్ ప్రకారం ఈ ఫోన్ Pantone “Cloud Dancer” అనే సాఫ్ట్ క్రీమీ వైట్ కలర్‌లో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది.
IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పు?, ఒక్క మ్యాచ్‌కే పక్కనపెడితే!
Also Read
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- 7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
2026 సంవత్సరానికి పాంటోనే (Pantone) అధికారిక రంగుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ షేడ్‌ను వెగన్ లెదర్ బ్యాక్ ఫినిష్‌తో జత చేయడంతో మరింత స్టైలిష్ లుక్ వచ్చింది. వెనుక భాగంలో 14 అసలైన స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్ అమర్చడం ఈ ఎడిషన్‌కు ప్రత్యేకమైన లగ్జరీ టచ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రేమ్‌పై “PANTONE Cloud Dancer” ఇంగ్రేవింగ్ ఇవ్వడం ద్వారా ప్రీమియమ్ బ్రాండింగ్‌ను హైలైట్ చేశారు.
ఈ ఏడాది మోటరోలా విడుదల చేస్తున్న రెండవ స్వరోవ్‌స్కీ థీమ్ మొబైల్ ఇది. ఇంతకుముందు Razr 60 కి కూడా స్వరోవ్‌స్కీ స్పెషల్ ఎడిషన్ వచ్చింది. రాబోయే ఈ మొబైల్ ధర వివరాలు ఇంకా వెల్లడించకపోయినా.. యూరప్‌లో సాధారణ Edge 70 ధర దాదాపు €799 నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ ప్రత్యేక ఎడిషన్ మరింత ఖరీదైన ప్రీమియమ్ ఎడిషన్‌గా ఉండొచ్చని అంచనా.
Viral Video: పానీపూరి కోసం నోరు తెరిచిన మహిళ.. పట్టుకున్న దవడ కండరాలు
హార్డ్‌వేర్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా.. స్టాండర్డ్ Edge 70 లో ఉన్న అన్ని ఫీచర్లు ఇదే మోడల్‌లో కూడా కొనసాగుతున్నాయి. ఇందులో 6.7 అంగుళాల 120Hz P-OLED డిస్‌ప్లే, IP68 + IP69 ప్రొటెక్షన్ రేటింగ్స్, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 12GB RAM, 512GB వరకు స్టోరేజ్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 4800mAh బ్యాటరీతో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, Android 16 తోపాటు నాలుగు మెజర్ OS అప్డేట్‌ల హామీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5.99mm మాత్రమే మందం కలిగిన అల్ట్రాస్లిమ్ డిజైన్ కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఈ ప్రత్యేక స్వరోవ్‌స్కీ ఎడిషన్ అధికారికంగా ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు ఇంకా లేవు. అయితే లీక్ కంటెంట్ చాలా క్లియర్‌గా ఉండటంతో, మోటరోలా త్వరలోనే దీనిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!