Son Killed Father: ప్రస్తుత సమాజం మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు కోసం ప్రజలు ఎలాంటి పనులు చేసేందుకైనా వెనకాడడం లేదు. డబ్బు ముందు రక్తసంబంధాలు కూడా మర్చిపోతున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌లోని సుర్జావలి గ్రామంలో డబ్బు కోసం కొడుకు తన తండ్రిని హతమార్చిన షాకింగ్ సంఘటన జరిగింది. ఈ వ్యవహారంలో రాజ్‌కుమార్ అలియాస్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. మృతదేహంపై ఉన్న దంతాల గుర్తుల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.
Read Also:Sudan: సూడాన్‌లో వైమానిక దాడులు.. 22 మంది మృతి
తండ్రి రూ.లక్ష ఇవ్వడం లేదని రాజ్ కుమార్ హత్య చేశాడు. హత్య సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై కాటు వేసిన గుర్తులు ఉన్నాయి. పోలీసులు అతడి ఫొటోలు తీసి గుజరాత్‌లోని లేబొరేటరీకి పంపించారు. పంటి గుర్తులను చూసిన పోలీసులు కుటుంబసభ్యులను అనుమానించారు. పోలీసులు కుటుంబ సభ్యుల పళ్ల గుర్తులను పరీక్షకు పంపారు. పరిశీలించగా మృతుడి పెద్ద కుమారుడి పంటి గుర్తు ఉన్నట్లు గుర్తించారు.
Read Also:Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రంగు మారింది చూశారా.. ఎంత బాగుందో !
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా.. జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మృతుడి తండ్రి దుస్తులు, డైరీ, బ్యాంకు పాస్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. మృతుడి తండ్రి నిందితుడు రాజును ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ కొడుకు కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకును హత మార్చాడు.