విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా విధానం ఒకే రాజధాని అది అమరావతే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… ఇందుకోసం 5 వేల కోట్లు ఇచ్చామని ఆయన అన్నారు. కుటుంబ పార్టీలు క్యాపిటల్ లేకుండా కాలక్షేపం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మేము అభివృద్ధి చేస్తోంటే ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయని ఆయన విమర్శించారు.
Also Read : Thieves in Girls Hostel: గర్ల్స్ హాస్టల్ లో దొంగలు పడ్డారు.. తరువాత ఏం జరిగిందంటే..
అభివృద్ధి మీద చర్చజరగడం లేదన్న సోము వీర్రాజు.. ఆయుష్ డిపార్ట్మెంట్ లో పెడింగ్‌లో పెట్టిన అంశాలను భీమవరం సభలో తీర్మానం చేస్తామన్నారు. జగన్ ఆరేళ్లు రోడ్డు మీద నడిచాడు… ఇప్పుడు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కనివ్వకుండా జీఓ ఇచ్చారని ఆయన అన్నారు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయనే వ్యాఖ్యలు అవగాహన రాహిత్యమని ఆయన అన్నారు. బియ్యం పంపిణీ రూపంలో ఏటా 5వేల కోట్లు పక్కదారిపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Revanth Reddy: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిదర్శనం