Somireddy Chandramohan Reddy: రైతుల ఆత్మహత్యల్లో.. అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy: రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. ఇక, నాకు విదేశాల్లో వేయి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని కాకాని తప్పుడు ఆరోపణలు చేశారు.. అదేవిధంగా రైతుల కోసం వెచ్చించిన ఖర్చును కూడా తప్పుగా చూపించారని మండిపడ్డారు.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. అంతే కాదు రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం అన్నారు. 400 పైగా మండలాలలో కరువు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను పరిశీలించేందుకు టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ పర్యటిస్తోందిన.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.
Read Also: Kishore Satya: సౌత్ లో సప్త జ్యోతిర్లింగ టూర్ ని ప్రారంభించబోతున్నాం..కిషోర్ సత్య
Also Read
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
అయితే, తిట్లీ తుఫాను వచ్చినప్పుడు నిబంధనల కంటే అధికంగా నష్ట పరిహారాన్ని రైతులకు ఇచ్చాం అని తెలిపారు సోమిరెడ్డి.. ఇక, రొయ్యల రైతులపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారు.. అవినాష్ రెడ్డి.. అదానీ.. షిరిడి సాయి సంస్థలను మాత్రమే బతికిస్తున్నారు.. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలుకు 66 వేల కోట్ల రూపాయలు వెచ్చించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవంగా వెచ్చించిన ఖర్చును వివరించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతుల మధ్యకు వెళ్లాలి అని సవాల్ చేశారు. రైతులకు వేలకోట్ల మేర బకాయిలు చెల్లించాలి.. అదేవిధంగా విద్యుత్ రంగ సంస్థలకు కూడా భారీగా బకాయిలు ఉన్నాయి.. రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రైతులకు అందిస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!