January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే గుర్తొచ్చే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే వెంకీ, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ సినీ ప్రియుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటివరకు #VenkyAnil5 మరియు #NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్‌తో కొనసాగిన ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి తోడు ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను జతచేసి, సినిమాలో వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ మధ్య నడిచే బావా-బామ్మర్దుల సరదా అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేశారు.
ఈ ప్రమోషనల్ వీడియో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. దిగ్గజ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ రూపొందించిన క్లాసిక్ కామెడీ ‘అప్పుల అప్పారావు’ సీన్‌తో ప్రారంభమైన ఈ వీడియోలో.. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి నలుగురూ కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని టైటిల్ ఏంటని ప్రశ్నిస్తారు. దానికి అనిల్ “జనవరి 12 విడుదల” అని సమాధానమివ్వగా, విడుదల తేదీ కాకుండా సినిమా పేరేంటని వారంతా కన్ఫ్యూజ్ కావడం, చివరికి అదే టైటిల్ అని రివీల్ చేయడం వంటి సన్నివేశాలతో వీడియోలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చక్కగా పండింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి గతంలో సాధించిన భారీ విజయాల ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి బలమైన తారాగణంతో రాబోతున్న ఈ చిత్రం 2027 జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!