Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Ticket Prices: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సినిమా టికెట్ ధరలు పెద్దగా పెరగకుండా అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం ఇటీవల కాలంలో వ్యక్తమవుతోంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుండటంతో ఇండస్ట్రీలోనూ పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ కారణంగా మరోసారి టికెట్ రేట్ల పెంపు అంశం తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై పరిమితులు ఉండటంతో చిత్రబృందం ఏపీపై ఆశలు పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. గతంలో ఏపీలో పలు భారీ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ‘టాక్సిక్’కు కూడా అలాంటి అవకాశం లభించవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘టాక్సిక్’కు ఏపీలో టికెట్ ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో టికెట్‌పై సుమారు రూ.50 నుంచి రూ.100 వరకు అదనపు ధర ఉండొచ్చని, ఉదయం 6 గంటలకు నిర్వహించే బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 వరకు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ధరలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. ‘టాక్సిక్’ కన్నడ నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమా కావడంతో టికెట్ ధరల పెంపుపై కొందరు సినీ ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌ను ప్రేక్షకులపై టికెట్ ధరల రూపంలో భారం వేయడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా సినీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ‘కాంతార: చాప్టర్ 1’, ‘కూలీ’ వంటి డబ్బింగ్ చిత్రాలకు కూడా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో డబ్బింగ్ సినిమాలకు ధరల పెంపుపై మరోసారి చర్చ మొదలైంది.
Also Read
గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు అంశం పెద్దగా తెరపైకి రాలేదు. టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతో ‘కొరియన్ కనకరాజు’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లలో ఆదరణ చూపిస్తుండటం.. సినిమా పరిశ్రమకు సానుకూల సంకేతంగా మారింది. ఈ నేపథ్యంలో మళ్లీ టికెట్ ధరలు పెంచితే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడుతున్న ఈ సమయంలో మళ్లీ టికెట్ ధరలు పెంచే నిర్ణయం తీసుకుంటే అది సినిమాలపై ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపుపై వస్తున్న వార్తలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘టాక్సిక్’ టికెట్ ధరలు ఎంతవరకు పెరుగుతాయి? రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి అనుమతి ఇస్తారా? బెనిఫిట్ షోకు నిజంగానే రూ.500 ధర నిర్ణయిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!