SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI New Withdrawal Rules: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది.. తన Basic Savings Bank Deposit (BSBD) ఖాతాదారులకు సంబంధించి నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. 2026 అక్టోబర్ 1 నుంచి BSBD ఖాతాదారులు బ్యాంకు శాఖలో నెలకు నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదో విత్‌డ్రాయల్ నుంచి ప్రతి లావాదేవీపై రూ.15 రుసుముతో పాటు GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి?
SBI ప్రకారం ఈ మార్పులు అన్ని రకాల సేవింగ్స్ ఖాతాదారులకు వర్తించవు. Basic Savings Bank Deposit (BSBD) ఖాతాలు కలిగిన వారికి మాత్రమే ఈ కొత్త సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఖాతాదారులు ఒక నెలలో బ్యాంకు శాఖ నుంచి నాలుగు నగదు ఉపసంహరణలు ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటితే అదనపు ఛార్జీలు విధిస్తారు.
Also Read
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
గతంలో నిబంధనలు ఎలా ఉండేవి?
ఇప్పటి వరకు BSBD ఖాతాదారులకు నెలకు నాలుగు ఉచిత నగదు ఉపసంహరణలు ఉండేవి. ఇందులో SBI ATMలు, ఇతర బ్యాంకుల ATMలు, బ్యాంకు శాఖల్లో నగదు విత్‌డ్రాయల్స్, మైక్రో ATM లావాదేవీలు కూడా లెక్కలోకి వచ్చేవి. అయితే UPI, NEFT, RTGS, IMPS వంటి డిజిటల్ లావాదేవీలు ఈ పరిమితిలోకి రావు.
కొత్త నిబంధనలో కీలక మార్పు ఇదే
అక్టోబర్ 1 నుంచి నెలకు అందుబాటులో ఉండే మొదటి నాలుగు ఉచిత లావాదేవీలు బ్యాంకు శాఖలో చేసే నగదు ఉపసంహరణలకు మాత్రమే వర్తిస్తాయి. నాలుగు లావాదేవీలు పూర్తయిన తర్వాత బ్యాంకు శాఖ నుంచి చేసే ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ.15తో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది.
ATM విత్డ్రాయల్స్పై కూడా ఛార్జీ పడుతుందా?
కొత్త నిబంధనతో BSBD ఖాతాదారుల ATM విత్డ్రాయల్స్పై వెంటనే కొత్త ఛార్జీలు విధిస్తున్నారని భావించాల్సిన అవసరం లేదు. SBI ATMలు, ఇతర బ్యాంకుల ATMలు, మైక్రో ATMలు, బ్రాంచ్ విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన నిబంధనలను బ్యాంకు వేర్వేరుగా పేర్కొంది. ATM నగదు ఉపసంహరణలకు సంబంధించి ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయి.
BSBD ఖాతా అంటే ఏమిటి?
Basic Savings Bank Deposit (BSBD) Account అనేది ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రాథమిక పొదుపు ఖాతా. ఈ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఖాతాదారులకు ప్రాథమిక RuPay ATM-cum-Debit Card అందిస్తారు.
ఈ ఖాతాలో నగదు ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు?
BSBD ఖాతాదారులు బ్యాంకు శాఖలో విత్‌డ్రాయల్ ఫారం ద్వారా లేదా ATM ద్వారా నగదు తీసుకోవచ్చు. సాధారణంగా ఈ ఖాతాకు చెక్‌బుక్ సౌకర్యం ఉండదు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త ఛార్జీ నిబంధన ప్రధానంగా బ్యాంకు శాఖలో చేసే అదనపు నగదు ఉపసంహరణలకు సంబంధించినది.
BSBD ఖాతాను ఎవరు తెరవొచ్చు?
SBIలో BSBD ఖాతా తెరవాలనుకునే కస్టమర్‌కు ఇప్పటికే మరో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికే సేవింగ్స్ ఖాతా ఉంటే, BSBD ఖాతా తెరిచిన 30 రోజుల్లోపు ఆ ఇతర సేవింగ్స్ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది.
ఖాతాదారులు ఏం గమనించాలి?
BSBD ఖాతా ఉన్న SBI కస్టమర్లు అక్టోబర్ 1, 2026 నుంచి తమ బ్రాంచ్ నగదు ఉపసంహరణలను నాలుగు ఉచిత లావాదేవీల పరిమితిలో నిర్వహించుకోవడం మంచిది. ఐదో బ్రాంచ్ విత్‌డ్రాయల్ నుంచి ప్రతి లావాదేవీకి రూ.15తో పాటు GST వర్తించనున్నందున, తరచుగా బ్రాంచ్‌కు వెళ్లి నగదు తీసుకునే ఖాతాదారులు ఈ మార్పును గమనించాలి.
తాజావార్తలు
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!