రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీకి సీఎస్‌గా కేంద్రం సోమేశ్ కుమార్‌ను కేటాయించగా.. కేంద్రం ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణలో సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగేలా క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2017వ సంవత్సరంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కోరుతూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన సీజే ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం మంగళవారం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తుది తీర్పు ప్రకటించింది. సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ.. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ క్రమంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తో సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై సీఎంతో భేటీ అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : KTR: మోడీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మొన్న చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇప్పుడు చూపిస్తాం..!
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏపీకి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మధ్య డీఓపీటీ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను కేటాయించింది. అయితే.. పునః కేటాయింపు సమయంలో సోమేష్ కుమార్‌ను డీఓపీటీ ఏపీకి కేటాయించింది. దీంతో తన కేటాయింపును సవాలు చేస్తూ క్యాట్-హైదరాబాద్‌కు వెళ్లారు. మార్చి 29, 2016న తెలంగాణకు సోమేష్ కుమార్‌ను కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఈ ఆదేశాలను సవాలు చేస్తూ, డీఓపీటీ తెలంగాణ హెచ్‌సీలో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. సోమేశ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయించడంతో పాటు మరో 12 మంది అఖిల భారత సర్వీసు అధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని కూడా డీఓపీటీ ప్రశ్నించింది.
Also Read : Kiran Abbavaram: వారు నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తున్నారు