తాజాగా కన్నడ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రాజధాని, జరాసంధ వంటి పలు కన్నడ చిత్రాలకు పనిచేసిన నటుడు చేతన్ చంద్ర ఆదివారం మాతృదినోత్సవం కావడంతో తల్లితో కలిసి గుడికి వెళ్లారు. తల్లితో కలిసి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది.
Also Read: Bike Blast: హైదరాబాద్ లో పేలిన బుల్లెట్ బైక్.. 10 మందికి తీవ్ర గాయాలు..
చేతన్ చంద్ర తన తల్లితో కలిసి కారులో తిరిగి వస్తుండగా., కొంతమంది గూండాలు చేతన్ చంద్ర కారును వెంబడించి, కారుపై దాడి చేసి, కారు అద్దాలు పగలగొట్టారు. ఆపై చేతన్ చంద్రపై దాడి చేశారు. సుమారు 20 మందికి పైగా వ్యక్తులు చేతన్ చంద్రపై దాడి చేసి రక్తస్రావం అయ్యేలా దాడి చేసి వెళ్లిపోయారు. రక్తస్రావంతో ఉన్న చేతన్ చంద్ర తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కనిపించి జరిగిన సంఘటన గురించి మాట్లాడారు.
Also Read: Mumbai: ముంబైలో ధూళి తుఫాన్.. పట్టపగలే కమ్ముకున్న చీకటి
ఈమేరకు పోలీసులకు దాడి సంఘటనకు సంబంధించి విషయం తెలిపినట్లు అర్థమవుతుంది. చాలా మంది నెటిజన్లు చేతన్ చంద్ర వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు. చేతన్ పై దాడిని పలువురు కన్నడ సినీ ప్రముఖులు ఖండించారు. అలాగే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చేతన్ చంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.