వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. పాతపట్నంలో ఈ జనవాహిని చూస్తుంటే సముద్రం పొంగివచ్చిందా అన్న రీతిలో హాజరయ్యారన్నారు. పార్టీ పట్ల, జగన్ పట్ల, మీ నాయకురాలి పట్ల అభిమానం కనపడుతోందన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
పల్నాడు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... 2024లో జగనే మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే ప్రతి పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని తెలిపారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.. గడిచిన నాలుగు ఏళ్లుగా జగన్ చేసిన మేలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు.