సోషల్ మీడియాలో ఈ మధ్య రకరకాల వీడియోలో వైరల్ అవుతున్నాయి.. మంచుతో కూడా కొత్త కొత్త వంటలను చేస్తున్నారు.. తాజాగా ఓ మహిళ మంచుతోనే కాఫీని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
మంచును కొంతమంది డ్రింక్స్ లో కూడా వాడేస్తుంటారు.. అలా చెయ్యడం వల్ల ఎన్నో సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.. తాజాగా ఒక మహిళ నేలపై ఉన్న ఐస్ తీసుకొని దానితో మిల్క్ కాఫీ తయారు చేసుకుంది. దాని తయారీకి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేసింది.. నేల పై ఉండే మంచూతో డ్రింక్ ఎలా తయారు చేయాలో చూపించడం చాలా మందికి కోపం తెప్పించింది. ఆమె దానిని ‘స్నో లాట్టే’ అని పిలిచింది.భూమి నుంచి మంచును ఉపయోగించడం చాలా ప్రమాదకరమని నెటిజన్లు చెప్పారు.. అందులో సూక్ష్మక్రిములు, ధూళి, జంతువుల మూత్రం లేదా మలం కూడా ఉండవచ్చు..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో మహిళ ముందుగా ఒక బౌల్ లో మంచును తీసుకుంది.. దానిపై బ్లాక్ కాఫీని పోసింది. అది మంచుతో కూడిన కోల్డ్ కాఫీలా అయ్యే వరకు ఆమె దానిని కదిలించింది.ఆ తర్వాత కొంచెం క్రీమ్, పంచదార వేసి బాగా కలపింది. ఆమె ఒక పెద్ద గాజు కూజా తీసుకుని లోపల కొద్దిగా పంచదార పాకం పెట్టింది.. దాన్ని గ్లాసులో పోసింది.. అంతేకాదు దానికి ఐస్ క్యూబ్ లను కూడా కలిపింది.. దాన్ని టేస్ట్ చేసింది.. ఆ వీడియోను పోస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, ఇరవై రెండు వేల మందికి పైగా కామెంట్ చేశారు. అయితే చాలా వరకు ఆమె వీడియో పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి…