సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయపడతారు. వాటిని దగ్గరగా చూస్తే ఇక అంతే సంగతులు. పాములు చాలా విషపూరితమైనవి కాబట్టి వాటికీ కాస్త దూరంగా ఉండడమే మంచిది. కాకపోతే ఓ వ్యక్తి, ఏకంగా ఆరు పాములను పట్టుకుని ఆడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కావాలనే ఇలా చేశాడో., లేక వైరల్ అయ్యేందుకే చేశాడో తెలియదు కానీ.. యువకుడి పాము ట్రిక్ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తన చేతులతో ఆచం చేతిలో కర్రల మాదిరిగా పట్టుకున్నట్లు దాదాపు ఆరు పాములను పట్టుకున్నాడు. ఆపై అతను పాములతో ఆడుకుంటూ కనిపించాడు. అయితే పాములను ఈ విధంగా హింసించడం సరికాదన్న వివాదాల మధ్య అతడు పాములతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..
ఇక సంఘటన జరిగిన తేదీ, ప్రదేశం లాంటి విషయాలు తెలియరాలేదు., అయితే ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇంస్టాగ్రామ్ లో ఓ వినియోగదారు పోస్ట్ చేసాడు. “ర్యాట్ స్నేక్” అనే శీర్షికతో ఈ పోస్ట్ పెట్టారు. కొద్దీ రోజుల క్రితం ఈ పోస్ట్ షేర్ చేయగా., కేవలం లైకులే లక్ష కంటే ఎక్కువ వచ్చాయి.
Also Read: T20 World Cup: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూసే అవకాశం
వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. పాములు విషపూరితమైనవి. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి విన్యాసాలు ప్రమాదకరం. వారు “జంతువుల పట్ల హింస” చేసిన వ్యక్తిని శిక్షించాలనుకుంటున్నారు.