Drugs : దేశ సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా గుట్టురట్టు చేశారు అధికారులు. అక్రమంగా రవాణా అవుతున్న 2,500కిలోల హై ప్యూరిటీ మెతామ్ఫిటమైన్ ను పట్టకున్నారు. దీని విలువ రూ. 12 వేల కోట్లు ఉండనున్నట్లు అంచనా. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర తీరం వెంబడి డ్రగ్స్ రవాణా జరుగుతుందని 15 రోజుల క్రితమే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు నార్కోటిక్స్ నియంత్రణ విభాగం (ఎన్సీబీ), భారత నేవీ సంయుక్తంగా జరిపిన ఈ దాడిలో అరేబియన్ సముద్రంలో ఇరాక్ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా నౌకలో రవాణా అవుతున్న హెరాయిన్‌ను పట్టుకున్నారు.
Read Also:Gujarat: గుజరాత్ లో విషాదం.. నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 12,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. డ్రగ్స్ లో మెత్ గా ఈ మాదకద్రవ్యాన్ని పిలుస్తారు. డ్రగ్స్ పట్టివేత కోసం అధికారులు ఆపరేషన్ సముద్ర గుప్త నిర్వహించారు. శ్రీలంక, మాల్దీవులు సమాచారంతో ఇండియన్ నేవీ ఎన్సీఈఆర్బీ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు NCRB గుర్తించింది. ఇంతకుముందెప్పుడూ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. సముద్ర జలాల్లోనే డ్రగ్స్ పట్టివేత.. పాకిస్తాన్ దేశానికే చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాల్లో శనివారం నలుగురు స్మగ్లర్ల నుంచి పోలీసులు భారీగా నగదు, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు వివిధ రాష్ట్రాల్లో హెరాయిన్ సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
Read Also:Kondagattu: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. మాలదారులతో కిటకిటలాడుతున్న ఆలయం