భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్స్‌లు బాదడంతో ప్రపంచ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లే లీ రికార్డును అధిగమించింది. అత్యధిక సిక్సర్ల రికార్డు: మహిళల వన్డేల్లో ఒక…
న్యూజిలాండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ రాధ యాదవ్ (3/35), అరంగేట్ర పేసర్ సైమా ఠాకోర్ (2/26) సత్తాచాటారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో వన్డే అహ్మదాబాద్‌లోనే ఆదివారం జరుగుతుంది.…