East Coast Train : ఈ మధ్య కాలంలో ట్రైన్ ప్రమాదాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. కారణాలేంటో తెలియదు కానీ తరచూ ట్రైన్లలో మంటలు, పట్టాలు తప్పుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలులో వంగపల్లి వద్దకు రాగానే పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. అయితే గాలి పైపు పగిలిపోవడంతో పొగలు వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్ కు మరమ్మతులు చేసి రైలును పంపించారు.