Gunfire : అమెరికాలోని దక్షిణ అర్కాన్సాస్‌లోని జనరల్ స్టోర్ లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఫోర్డైస్‌లోని మ్యాడ్ బుట్చర్ జనరల్ స్టోర్ లో కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు.