ఎంతో భవిష్యత్ ఉన్న ఓ మోడల్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. 31 ఏళ్ల వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. బాయ్‌ఫ్రెండ్ చంపేశాడో.. ఇంకెవరైనా ఏమైనా చేశారో తెలియదు గానీ.. ఆమె డెడ్‌బాడీ మార్చురీలో ప్రత్యక్షమైంది. ఆమె మరణవార్త తెలిసి.. కుటుంబ సభ్యులు దు:ఖంలో మునిగిపోయారు.
థాయ్‌లాండ్‌కు చెందిన మోడల్ కైకన్ కేన్నకం మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వెళ్లింది. అక్కడ ఒక రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తోంది. అయితే అక్కడ ఒక అబ్బాయి పరిచయం కావడంతో అతడితో కలిసి ఉంటుంది. తాను బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు కైకన్ కేన్నకం సమాచారం అందించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులతో ఫ్యామిలీ మెంబర్స్‌కు టచ్‌లో ఉంది. అయితే హఠాత్తుగా ఏప్రిల్, 2023లో ఆమె పోస్టులు ఆగిపోయాయి. అంతేకాకుండా ఆమె ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెంది థాయ్‌లాండ్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అయినా ఏడాది నుంచి ఆమెకు సంబంధించిన సమాచారం తెలియకుండా పోయింది.
ఇది కూడా చదవండి: Marriage Canceled: రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడు.. దాంతో పెళ్లి క్యాన్సిల్..
అయితే ఏప్రిల్ 18, 2024న థాయ్ రాయబార కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోని మార్చురీలో గుర్తు తెలియని ఆగ్నేయాసియా మహిళ మృతదేహాన్ని ఉంచినట్లు కుటుంబ సభ్యులకు వార్త అందింది. ఆమె కాలుపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతదేహం కైకాన్ కేన్నకంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె మరణానికి ఆల్కహాల్ పాయిజనింగ్ కారణంగా తీవ్రమైన కార్డియోపల్మోనరీ వైఫల్యం చెందినట్లుగా రిపోర్టులో తేలింది. దీంతో కేన్నకం మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలోనే చనిపోయినట్లుగా భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మృతదేహం స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు స్థానిక మీడియాలు కథనాలు వెలువరించాయి.
ఇక కైకాన్ మృతిపై ఆమె సోదరి సుతిదా న్గెర్న్‌తావోర్న్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం తన సోదరి ఉద్యోగం కోసం బహ్రెయిన్ వెళ్లిందని తెలిపింది. అక్కడ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడానికి అధికారుల సహాయం కోరినట్లు ఆమె తెలిపారు. ఈనెల 18న కైకాన్‌కు సంబంధించిన సమచారం బహ్రెయిన్‌లోని థాయ్ ఎంబసీ తెలిపిందని పోస్టులో సుతిదా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?