స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులకు గాయాలైన ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దధిబాధి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు అర డజను మంది పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు.. పిల్లలందరినీ బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. గాయాలైన పిల్లలను వెంటనే బనియాపూర్ రిఫరల్ ఆసుపత్రిలో…