Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింస.. సిట్ నివేదికలో కీలక అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నివేదిక సమర్పించింది సిట్. రెండు వాల్యూముల్లో సిట్ నివేదిక సమర్పించారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు.. తాము గుర్తించిన అంశాలతో పాటు.. తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూములో తొమ్మది ఛాప్టర్లల్లో తమ అబ్జరవ్వేషన్లను ఉంచిన సిట్. రెండో ఛాప్టర్లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగులను ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది.
Read Also: France: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎన్నికలకు పిలుపు
Also Read
- FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ఇక, సిట్ నివేదిక విషయానికి వస్తే.. పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకూ పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదు. నిందితుల్ని ప్రశ్నించకపోవటంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్ లో ఆగంతకులుగా నమోదు చేయటం సరైంది కాదు. నిందితులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయలేదని సిట్ పేర్కొంది.. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంతవరకూ జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీల పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు.. పల్నాడులో 276, తిరుపతి 70. అనంతపురంలో 718 మందిని అరెస్ట్ చేశాం. పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతలో 527 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్న సిట్.. ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే.. వారిలో 1245 మందిని గుర్తించామని తెలిపింది.. చాలా మందిని గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారనే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీరిని గుర్తించే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపింది.
Read Also: Ramcharan : బ్రేకింగ్: బాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్
మరోవైపు.. పట్టపగలే సంఘటనలు జరిగినా.. ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయారని సిట్ పేర్కొంది.. ఈవీఎంల ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్ క్యాస్టింగ్ ఉన్నా.. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ స్టేషన్లల్లో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసే విషయంలో బీఎల్ఎలు.. వీఆర్వోలు చాలా ఆలస్యం చేయడం ఆశ్చర్యమనిపించిందని తన నివేదికలో రాసుకొచింది.. సరైన దర్యాప్తు చేయాలని ఇన్వేస్టిగేష్ అధికారులకు మెమో జారీ చేశాం. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొంది సిట్.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!