ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నివేదిక సమర్పించింది సిట్. రెండు వాల్యూముల్లో సిట్ నివేదిక సమర్పించారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు.. తాము గుర్తించిన అంశాలతో పాటు.. తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూములో తొమ్మది ఛాప్టర్లల్లో తమ అబ్జరవ్వేషన్లను ఉంచిన సిట్. రెండో ఛాప్టర్‌లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగులను ఎఫ్ఐఆర్‌ల…