TSPSC : టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన తండ్రీకుమారులు మైసయ్య, జనార్ధన్‌ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. వీళ్లిద్దరు నిందితుల నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. మైసయ్య తన కుమారుడి కోసం ఏఈ పేపర్ కొన్నట్లు వారు వెల్లడించారు.
Read Also : Kidney Stones : కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. ఇవి పాటించండి
డాక్యాకు రూ.2 లక్షలు ఇచ్చి పేపర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసులో 19 మంది అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిగే కొద్ది కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. మైసయ్య వికారాబాద్ ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ కేసులో మరో నిందితురాలైన రేణుక భర్త డాక్యా నాయక్‌తో మైసయ్యకు పరిచయం ఏర్పడింది.
Read Also: Poonch terror attack: పూంచ్ ఉగ్రదాడిలో ఏడుగురు టెర్రరిస్టుల హస్తం..
మైసయ్య కొడుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాడని తెలిసి డాక్యా నాయక్.. ఏఈ క్వశ్చన్ పేపర్‌ను ఆరు లక్షలకు బేరం పెట్టాడు. మైసయ్య రూ.2 లక్షల వరకు అయితే చెల్లించుకుంటానని చెప్పాడు. మైసయ్య తన ఖాతాకు డబ్బు బదిలీ చేసిన తర్వాత డాక్యా ఏఈ ప్రశ్నపత్రాన్ని అందించాడు. వెంటనే మైసయ్య తన కుమారుడికి ఆ పత్రాని ఇచ్చి పరీక్ష రాయించాడని సిట్ అధికారులు తెలిపారు.