కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ-కేవైసీ ప్రక్రియ 2025 మార్చి 31తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు e-KYC ప్రక్రియ గడువు పొడిగించింది.
Also Read:Rashmika : నాకెవరూ సపోర్ట్ చేయలేదు.. సొంతంగానే ఎదిగా : రష్మిక
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2025 ఏప్రిల్ 30 వరకూ e-KYC ప్రక్రియ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా చట్టం క్రింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకుల సబ్సిడీలలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా కేటాయింపు కొరకు e-KYC ప్రక్రియ తప్పనిసరి. లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని గడువు తేదీ లోగా e-KYC ప్రక్రియను పూర్తిచేయవచ్చని అధికారులు తెలిపారు.