Hero Simbu: నిఖిల్ కోసం ‘టైమ్ ఇవ్వు పిల్లా…’ అంటున్న శింబు ‘వల్లభ, మన్మథ’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో శింబు. శింబులో నటుడే కాదు మంచి సింగర్ కూడా ఉన్నాడు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ పాటలు పాడాడు శింబు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలలో శింబు పాడిన పాటలు మంచి హిట్ అయ్యాయి కూడా. ఇప్పుడు మరో యంగ్ హీరో నిఖిల్ కోసం పాట పాడబోతున్నాడు శింబు.
‘కార్తికేయ2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ త్వరలో ’18పేజిస్’తో రాబోతున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన…’ అనే పాటను కూడా విడుదల చేసారు. ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు శింబు తో ఓ పాట పాడించనున్నారు.
Boss Party: మాస్ పాటలో చిరు ‘ఐకానిక్ స్టెప్’
ఎన్టీఆర్ బాద్ షాలో ‘డైమెండ్ గర్ల్…’ మంచు మనోజ్ ‘పోటుగాడు’లో ‘బుజ్జి పిల్ల…’ రామ్ పోతినేని ‘వారియర్’లో ‘బుల్లెట్ సాంగ్..’ పాటలతో అలరించిన శింబు ఇప్పుడు నిఖిల్ ’18పేజిస్’ కోసం ‘టైం ఇవ్వు పిల్ల… టైం ఇవ్వు’ అనే పాటను పాడనున్నాడు. ఈ పాట కూడా చార్ట్ బస్టర్ హిట్ కావటం ఖాయమనే నమ్మకాన్ని యూనిట్ వ్యక్తం చేస్తోంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి శింబు పాడనున్న ‘టైమ్ ఇవ్వు పిల్లా’ పాట ’18పేజిస్’కు ఏ మేరకు హెల్ప్ అవుతుంది… ‘కార్తికేయ2’ సక్సెస్ ను ఈ నిఖిల్ ఈ సినిమాతోనూ కొనసాగిస్తాడేమో చూడాలి.