మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, ఇప్పుడు మాస్ సినిమాతో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్. కృష్ణ దర్శకత్వంలో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, గౌతం వాసుదేవ్ మీనన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించిన పత్తు తల సినిమా మూడ్ ని టీజర్ తోనే ఎస్టాబ్లిష్ చెయ్యడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. టీజర్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ వైట్ అండ్ వైట్ లో ఉంటే, శింబు బ్లాక్ అండ్ బ్లాక్ లో ఉన్నాడు.
క్యారెక్టర్స్ మధ్య ఈ వేరియేషన్స్ చూస్తే పత్తు తల సినిమా గుడ్ అండ్ బాడ్ మధ్య ఫైట్ లా కనిపిస్తుంది కానీ ఇందులో నిజంగా బ్లాక్ అనేది బాడ్ కి నిదర్శనమా? నలుపు వేసుకున్న శింబు చెడ్డ వాడా? అనే ప్రశ్నకి సమాధానం పత్తు తల ఇంటర్వెల్ తర్వాత రివీల్ అవుతుంది. కన్నడలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది, ఈ మూవీకి రీమేక్ గా ‘పత్తు తల’ తెరకెక్కింది. అందులో శివన్న పోషించిన పాత్రని తమిళ్ లో శింబు ప్లే చేస్తున్నాడు. కన్నడలో శ్రీ మురళి క్యారెక్టర్ ని తమిళ వర్షన్ లో గౌతమ్ కార్తీక్ కనిపిస్తున్నాడు. మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న పత్తు తల సినిమాకి టీజర్ మంచి గ్రౌండ్ ని ప్రిపేర్ చేసింది. కన్నడలో ఉన్న టెంపోని అలానే ఉంచి, కృష్ణ పత్తు తల సినిమా చేసి ఉంటే మాత్రం శింబుకి సాలిడ్ హిట్ పడినట్లే.