Bharat Jodo Yatra: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి నేడు పంజాబ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీని బల్కౌర్ సింగ్ సిద్ధూ కలిసిన వీడియోను పార్టీ ట్వీట్ చేసింది. ప్రముఖ పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ ముసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ సిద్ధూరాహుల్ గాంధీతో కలిసి ద్వేషం, భయం, హింసను వ్యాప్తి చేసే శక్తులకు తగిన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పంజాబ్‌లోని మాన్సాలో పట్టపగలు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారని పేర్కొంది.
సిద్ధూ మూసేవాలాగా పేరుగాంచిన శుభదీప్ సింగ్ సిద్ధూ గతేడాది మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. కెనడాకు చెందిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. గత నెలలో అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే రూ.2 కోట్ల బహుమతిని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి బల్కౌర్ సింగ్ సూచించిన సంగతి తెలిసిందే. పారితోషికాన్ని కూడా తన జేబులోంచి ఇస్తానన్నారు.
Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!
కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు నిలిపివేసిన భారత్ జోడో యాత్ర ఇవాళ జలంధర్ ఖల్సా కాలేజ్ గ్రౌండ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. యాత్రలో గుండెపోటు రావడంతో చౌదరి శనివారం మరణించారు. పంజాబ్‌లో భారత్ జోడో యాత్ర బుధవారం ఫతేఘర్ సాహిబ్‌లోని సిర్హింద్ నుంచి ప్రారంభమైంది. లోహ్రీ పండుగ నేపథ్యంలో శుక్రవారం యాత్రకు బ్రేక్ పడింది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జనవరి 30 నాటికి శ్రీనగర్‌లో ముగుస్తుంది. శ్రీనగర్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గాంధీ జాతీయ జెండాను ఎగురవేస్తారని భావిస్తున్నారు. దీని కోసం కాంగ్రెస్ 21 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించింది.
आज #BharatJodoYatra में प्रसिद्ध पंजाबी गायक स्वर्गीय सिद्धू मूसेवाला के पिता बलकौर सिंह सिद्धू जी ने @RahulGandhi जी के साथ कदम मिलाकर नफ़रत, डर और हिंसा फैलाने वाली ताकतों को मुंहतोड़ जवाब दिया।
सिद्धू मूसेवाला की पंजाब के मानसा में दिनदहाड़े हत्या कर दी गई थी। pic.twitter.com/FnjwUIm6xa
— Congress (@INCIndia) January 15, 2023