Side Effects Of Eating Apples: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం రాదు అంటూ మనకు సామెత కూడా ఉంది. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా యాపిల్ ను తింటూ ఉంటారు. ఎవరికైనా ఆరోగ్యం పాడైతే యాపిల్స్ తినిపిస్తూ ఉంటారు. అనారోగ్యం పాలైనప్పుడు ప్రధానంగా తినే పండ్లలలో ఇది ఒకటి. దీనిలో ఉండే ఏ విటమన్ కంటికి చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొన్ని పరిశోధనల్లో యాపిల్ ఎక్కువగా తింటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు.
దీని వల్ల పాంక్రియాస్ క్యాన్సర్ తో పాటు అనేక రోగాలు వస్తాయని గుర్తించారు. అంతే కాదు యాపిల్ పండించడానికి అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. వాటిని శుభ్రంగా కడగకపోతే అవన్నీ శరీరంలోకి చేరి హాని కలిస్తాయని అంటున్నారు. ఇక యాపిల్స్ తాజాగా కనిపించడానికి దాని పైన వ్యాక్స్ ను పూస్తూ ఉంటారు. దీనిలో ఉండే సర్ఫర్ డైయాక్సైడ్ వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక యాపిల్ విత్తనాలు అయితే విషంతో సమానమే. ఎందుకంటే ఇవి ఎక్కువగా మన శరీరంలోకి వెళ్తే హాని కలుగుతుంది. ఒకటి రెండు వాటికి ఏం కాదు. అదే ఇవి ఎక్కువ మోతాదులో శరీరంలో చేరితే ప్రాణాంతకం కావచ్చు. దీని వల్ల కడుపులో నొప్పి, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. యాపిల్ విత్తనాల్లో ఉండే అధిక శాతం అమిగ్డాలిన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ సమతుల్యం చెడిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. దీంతో చనిపోయే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యానికి మంచిది అంటున్నారని ఆపిల్స్ ను ఎక్కువగా తినకండి. అలాగే తినే ముందు దానిని శుభ్రంగా కడిగిన తరువాత మాత్రమే తినండి.