Ragging : సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న కాలేజీలో జాయిన్ అయిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయి (18)ను అదే కాలేజీకి చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగ్ చేసినట్లు సమాచారం. గడ్డం ఎందుకు పెంచుకున్నావని సీనియర్లు ప్రశ్నించగా, దేవుడికి మొక్కు ఉందని చెప్పినా వినకుండా ట్రిమ్మర్‌తో గడ్డం తీయించినట్లు బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంతటితో ఆగకుండా, మరోసారి గడ్డం పెంచితే…