Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు జలసమాధి అయ్యారు. మృతులందరూ బలవంతపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంలో బలవంతపూర్ వాసి రాజు (35), ఆయన భార్య భాగ్య (22), వారి ఐదేళ్ల కుమారుడు నియాన్ష్, మూడేళ్ల కుమార్తె శాన్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఇటీవల జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి రాజు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. వేడుక ముగించుకుని రాత్రి సమయంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అర్థరాత్రి దాటినా వారు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాజు , ఆయన భార్య భాగ్య ఫోన్లకు వరుసగా కాల్స్ చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని రావడంతో అనుమానం వచ్చిన బంధువులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అప్పనపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఒక కారు మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. వాహనం లోపల పరిశీలించగా నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకట్లో డ్రైవింగ్ చేస్తుండగా అదుపు తప్పి కారు నేరుగా బావిలోకి దూసుకెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారి పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్ , అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. చిన్నపిల్లల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదం జరిగిన తీరుపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!