Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: శ్రీలంకతో గాల్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టును యువ స్టార్ శుభ్‌మన్ గిల్ నడిపించబోతున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్‌కు ఈ సిరీస్ ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే సువర్ణావకాశం లభించింది. ఈ రెండు మ్యాచ్‌లలో గిల్ మరో 157 పరుగులు చేస్తే చాలు, డబ్ల్యూటీసీ చరిత్రలోనే 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
ఇప్పటికే డబ్ల్యూటీసీలో గిల్ పేరిట అద్భుత రికార్డు ఉంది. 40 మ్యాచ్‌ల్లోని 73 ఇన్నింగ్స్‌లలో 43.07 సగటుతో 2843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. భారత బ్యాటర్లలో ప్రస్తుతం ఎవరూ కూడా గిల్ రికార్డుకు సమీపంలో లేకపోవడం విశేషం. ఈ జాబితాలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 40 మ్యాచ్‌ల్లో 2780 పరుగులతో (బెస్ట్ స్కోరు: 146, సగటు: 41.49, 6 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు) రెండో స్థానంలో ఉండగా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 40 మ్యాచ్‌ల్లో 2716 పరుగులతో (బెస్ట్ స్కోరు: 212, సగటు: 41.15, 9 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ 46 మ్యాచ్‌ల్లో 2617 పరుగులు (బెస్ట్ స్కోరు: 254, సగటు: 35.36, 5 సెంచరీలు, 11 అర్ధసెంచరీలు), రవీంద్ర జడేజా 48 మ్యాచ్‌ల్లో 2610 పరుగులతో (బెస్ట్ స్కోరు: 175, సగటు: 42.78, 5 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు) ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మాత్రం డబ్ల్యూటీసీలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 6651 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా గిల్ ఓ అరుదైన ఘనతకు అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుత 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత కెప్టెన్‌గా గిల్ 8 మ్యాచ్‌లలోనే 950 పరుగులు చేశాడు. శ్రీలంకపై కేవలం మరో 50 పరుగులు జోడిస్తే, ఒకే డబ్ల్యూటీసీ సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా గిల్ నిలుస్తాడు. గతంలో విరాట్ కోహ్లీ (2019-21లో 934 పరుగులు), రోహిత్ శర్మ (2023-25లో 864 పరుగులు) కెప్టెన్లుగా ఉన్న సమయంలో ఈ మైలురాయిని అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్‌గా ఒకే డబ్ల్యూటీసీ సైకిల్లో 1000 ప్లస్ పరుగులు చేసిన భారత ప్లేయర్ల జాబితాను పరిశీలిస్తే.. ఇప్పటివరకు అజింక్య రహానే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. శ్రీలంక సిరీస్‌లో ఆ ఒక్క 50 పరుగుల మార్కును దాటితే, ఈ మైలురాయిని చేరుకున్న నాలుగో భారతీయ బ్యాటర్‌గా గిల్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాడు.
తాజావార్తలు
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!