ఇస్రో, నాసా మిషన్ ఆక్సియం-04 కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాంశు శుక్లా, తన సిబ్బందితో కలిసి భూమిపైకి తిరిగి రానున్నాడు. అంతరిక్ష నౌక ఈరోజు భూమికి పయనమవుతుంది. అంతరిక్ష పరిశోధన విజ్ఞానంలో భారత్ సాధించిన మరో ఘన విజయం ఇది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) సందర్శించిన భారత అంతరిక్షయాత్రికుడు గ్రూప్ కప్టెన్ శుభాంశు శుక్లా.. “యాక్సిమ్ -4” మిషన్ (Undocking) “అన్ డాకింగ్” ప్రక్రియ నేడు మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.
Also Read:Radhika Yadav: రాధిక హత్యపై రెండో వీడియో విడుదల చేసిన స్నేహితురాలు.. ఏం చెప్పిందంటే..!
రేపు మధ్యాహ్నం 3 గంటలకి భూమిపై దిగనున్న “యాక్సిమ్-4 క్యాప్సుల్”.. “యాక్సిమ్ -4” మిషన్లో భారత్ నుంచి పాల్గొన్న శుభాంశు శుక్లా.. తిరుగు ప్రయాణం కానున్న మొత్తం నలుగురు అంతరిక్షయాత్రికులు.. “Axiom Space”, “NASA”, “SpaceX” సంయుక్తంగా చేపట్టింది ఈ మిషన్. శాస్త్రీయ ప్రయోగాలు, శరీరపరమైన పరీక్షలు, శిక్షణ పూర్తయ్యాక ఇప్పుడు తిరుగు ప్రయాణం ప్రక్రియ ప్రారంభం కానుంది. “Crew Dragon క్యాప్సూల్” ద్వారా భూమికి తిరిగి వస్తారు. సముద్రంలో ల్యాండింగ్.. శుభాంశు శుక్లా కు సంబంధించిన సమాచారం అధికారికంగా వెల్లడించిన కేంద్ర విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్.. ఇది “Axiom Space” నాల్గో ప్రైవేట్ మిషన్.. అంతరిక్ష ప్రయాణంలో ప్రైవేట్ కంపెనీల ప్రమేయం, కార్యాచరణలకు ఈ ప్రయోగం నిదర్శనం.
Also Read:Love Couple: పిచ్చి బాగా ముదిరిందిరోయ్.. హైదరాబాద్ లో రన్నింగ్ బైక్ పై రెచ్చిపోయిన ప్రేమ జంట
ఆక్సియం-04 మిషన్ ద్వారా ISS కి వెళ్ళిన నలుగురు వ్యోమగాములు శుభాన్షు శుక్లా (భారతదేశం), పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగరీ) ఈరోజు భూమికి బయలుదేరుతారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సాయంత్రం 4:30 గంటలకు ISS నుంచి భూమికి బయలుదేరుతుంది. ఈ అంతరిక్ష నౌక రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంటే జూలై 15న అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో ల్యాండ్ అవుతుంది.