Shruti Hassan : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ మొదట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. అప్పట్లో తాను నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాపులే కావడంతో తన పని అయిపోయిందని అందరూ కామెంట్లు చేశారు. కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఏ రోజు కూడా తన తండ్రి ఇమేజ్ ను తాను ఉపయోగించుకోలేదు. మొదట సింగింగ్ లో తన టాలెంట్ నిరూపించుకుంది. తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనేంటో ప్రూవ్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో శృతిహాసన్ నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి.
Read Also: Jammu kashmir Elections: జమ్మూకశ్మీర్ ప్రజలను ఊపిరి పీల్చుకోనివ్వండి: షేక్ అబ్దుల్ రషీద్
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన గతేడాది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇక తాజాగా హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అడివి శేష్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తప్పుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో తొలిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో అడివి శేష్, శృతిహాసన్ వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని కూడా టీం చెప్పుకొచ్చింది. దీనికి తోడు వచ్చే ఏడాది ఈ సినిమాతో పాటు మరో కొత్త మూడు సినిమాలు కూడా విడుదల చేస్తానని అడివి శేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also:Jammu kashmir Elections: జమ్మూకశ్మీర్ ప్రజలను ఊపిరి పీల్చుకోనివ్వండి: షేక్ అబ్దుల్ రషీద్