Shriya Saran responds trolls : ఇటీవల ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. శ్రియ శరణ్, ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్‌ల మధ్య కెమెస్ట్రీ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు చూశాం. పబ్లిక్‌గా తమ మధ్య ఉన్న ఆప్యాయతను చూపించడం వీళ్లకు అలవాటే. గతంలో ఇలాంటి ఎన్నో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ జంట స్టేజ్‌పైనే లిప్ లాక్‌తో ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. హిందీలో వచ్చిన దృశ్యం 2 స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా వీళ్లు కెమెరాల ముందే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ స్పెషల్ షోకు రెడ్ శారీలో వచ్చిన శ్రియ.. చాలా అందంగా కనిపించింది. ఆమె వెంట తన భర్త ఆండ్రీ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులివ్వాల్సిందిగా కోరినప్పుడు ఈ జంట లిప్ కిస్ ఇచ్చుకోవడం విశేషం.
Read Also: Hit-2 Trailer : అడవి శేషుకు మరో ‘హిట్’ గ్యారెంటీ.. అదిరిపోయిన టీజర్
ఈ ఫొటోలపై కొందరు అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటివి ఇంట్లో చేసుకోండి.. బయట ఎందుకు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీళ్లు ఎప్పుడు చూసినా ఎక్కడ పడితే అక్కడ ఇలాగే కిస్‌లు ఇచ్చుకుంటారు అంటూ మరోకరు ఘాటుగా స్పందించాడు. కెమెరా ముందు మాకెందుకిదంతా అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు యూజర్లు మాత్రం దీనిపై పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. దీంతో స్పందించిన శ్రీయ నేను చెత్త కామెంట్లను చదవను. వాటికి స్పందించను. అది వారి ఉద్యోగం. తన ఉద్యోగం వాటిని పట్టించుకోకపోవడం. తాను చేయాలనుకున్నదే చేస్తానంటూ ఘాటుగా విమర్శించారు.