ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ -2024 లో భాగంగా జరుగుతున్నముంబై – విదర్భ ఫైనల్ మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ తో అందరి ఫోకస్ తన పై పడేలా చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్. గత కొన్ని రోజులుగా అనవసర వివాదంతో ఈయన వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఘోరమైన ఫామ్ లో ఉన్న ఈయనను పూర్తి సిరీస్ కు సెలక్ట్ చేయలేదు బీసీసీఐ. ఈ దెబ్బతో సిరీస్ మధ్యలోనే బెంగళూరులో ఉన్న ఎన్సీఏకు అతడు తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో అతడు నేషనల్ డ్యూటీలో లేకపోవడంతో రంజీ ట్రోఫీలో ఆడమని శ్రేయస్ అయ్యర్ కి బీసీసీఐ సూచించింది. కాకపోతే శ్రేయస్ గాయం సాకుగా చెప్పి ఎన్ఏసీ లోనే ఉండిపోయాడు. ఈ కారణం చేత అతడి కాంట్రాక్ట్ ను బోర్డు రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Odisha: ఎన్నికల వేళ మహిళా ఉద్యోగులకు నవీన్ సర్కార్ గుడ్‌న్యూస్
ఇది ఇలా ఉండగా.., తాజాగా మెరుపు ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు అయ్యర్. ప్రస్తుతం విదర్భ టీంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో మళ్లీ అతని పై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చాయి. కాకపోతే రెండో ఇన్నింగ్స్లో మాత్రం కేవలం 111 బంతుల్లోనే 95 పరుగులు చేసి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. ఈ ఇనింగ్స్ లో అతడు చేసిన పరుగుల్లో దాదాపు 60 శాతం కేవలం బౌండరీలు, సిక్సుల ద్వారానే అతని ఆట ఏంటో అర్థం అవుతుంది. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులను కొట్టాడు.
Minister Adimulapu Suresh: బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్ కామెంట్లు..
ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు ముషీర్ ఖాన్ (136), ముంబై కెప్టెన్ అజింక్యా రహానె (73), షామ్స్ ములానీ (50 *) లతో రాణించడంతో ముంబై రెండో ఇన్నింగ్స్ లో 418 పరుగుల భారీ స్కోరును అందుకుంది. దింతో ఫైనల్ లో గెలవాలంటే విదర్భ టీంకి 537 పరుగుల టార్గెట్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఉన్న మ్యాచ్ పరిస్థితి చూస్తే మాత్రం ముంబై విజయం సునాయాసంగానే కనపడుతోంది. ఈ దెబ్బకు సెన్సేషనల్ నాక్ ఆడిన అయ్యర్ ను సోషల్ మీడియాలో నెటిజన్స్ పొగడ్తలతో మెచ్చుకుంటున్నారు.