IPL 2025 Mega Action: నేడు జెడ్డా వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడు రికార్డ్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి కైవసం చేసుకుంది. దీంతో గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుబోయిన మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మరోవైపు మరో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు పంజాబ్ రైట్ టు మ్యాచ్ ద్వారా చేజిక్కించుకుంది. హైదరాబాద్ అర్షదీప్ సింగ్ కోసం 18 కోట్ల వరకు ఫైనల్ బీడ్ వేయగా చివరకు పంజాబ్ రైట్ టు మ్యాచ్ ఉపయోగించి అతడిని కైవసం చేసుకుంది.
Also Read: IPL Mega Auction LIVE: కోట్ల వర్షం..అందరి కళ్లు.. ఈ ప్లేయర్లపైనే
ఇక ఈ వేలంలో దక్షిణాఫ్రికా బౌలర్ రబడ కూడా మంచి ధరనే పలికాడు. గుజరాత్ టైటాన్స్ అతడిని 10.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ జొస్ బట్లర్ ను రూ. 15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. ఇంకా ప్రస్తుతం వేలం పాట కొనసాగుతుంది. చివరిసారి భారీ ధర పలికిన మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 11.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు