Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ ప్లేయర్ క్యాచ్ అందుకొనే క్రమంలో మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో బ్యాట్ పట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరీ అయ్యర్ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Raja Saab Song Promo : రెబల్ సాబ్.. ప్రొమోతోనే ఆగమాగం అయితాంది..!
ప్రస్తుతం కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించుకున్నారు. ఆ రిపోర్టులను పరిశీలించిన డాక్టర్ దిన్షా పార్దివాలా అయ్యర్ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆయన శ్రేయస్‌కు కొన్ని సూచనలు చేశారు. కడుపుపై ఒత్తిడిని కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పారు. మరోసారి అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకున్న తర్వాత శ్రేయస్ ఎప్పుడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాలనేది తెలుస్తుంది.
అయితే శ్రేయస్ ఐపీఎల్ 2026 ప్రారంభం నాటికి పూర్తిగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రకటనల తర్వాత అయ్యర్ అభిమానులు నిరాశ చెందారు. ఎందుకంటే త్వరలో సౌతాఫ్రికా, జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు శ్రేయస్ దూరమవుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే శ్రేయస్ ఐపీఎల్ 2026లో ఆరంభంలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చని సమాచారం. ఏది ఏమైనా పూర్తి ఫిట్‌నెస్‌తో శ్రేయస్ అయ్యర్ కంప్లీట్‌గా రికవరీ అయ్యి మైదానంలోకి అడుగు పెట్టాలని ఆయన అభిమానులు, క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
READ ALSO: Mahesh Babu – Naga Chaitanya: నాగచైతన్య కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..