ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన వారిలో శ్రేయాంక పాటిల్ కూడా ఒకరు. తన స్పిన్ మెరుపులతో సత్తా చాటింది ఈ చిన్నది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలైన శ్రేయాంక పాటిల్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని తాజాగా శ్రేయాంక పాటిల్ కలిసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
Also Read: Tulasivanam Web Series: ఫ్రీ స్ట్రీమింగ్.. ఓటీటీలో రిలీజైన తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ తులసివనం..!
ఈ ట్వీట్ లో కోహ్లితో కలిసి దిగిన ఫొటోను శ్రేయాంక పాటిల్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు గాను కోహ్లి వల్లే తాను క్రికెట్ చూడటం మొదలుపెట్టానని చెబుతూ.. తనకి క్రికెట్ ఆట పై ఇష్టం పెరగడానికి కారణంకేవలం కోహ్లినేనని.. కోహ్లి మాదిరిగా తాను కూడా ఓ గొప్ప క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కంటూ జీవితంలో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ‘నా బౌలింగ్ బాగుందని.. అది కోహ్లి మెచ్చుకున్నాడని’ శ్రేయాంక తెలిపింది.
Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్
దాంతో కోహ్లికి నా పేరు తెలుసు అంటూ ఈ ట్వీట్‌లో పేర్కన్నది. అంతేకాకుండా తాను ఎప్పటికీ కోహ్లికి ఫ్యాన్‌నే అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించింది. ఆయన కోహ్లి తన రోల్ మోడల్ అని చెప్పుకొచ్చింది. ఈ దెబ్బతో కోహ్లి అభిమానులతో పాటు క్రికెట్ ఫాన్స్ శ్రేయాంక ట్వీట్ ను తెగ షేర్ చేసేస్తున్నారు. 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు ప్రాతినిథ్యం వహించిన శ్రేయాంక పాటిల్.. డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్ ను ఆర్‌సీబీ గెలవడంలో శ్రేయాంక కీలక పాత్రనే పోషించింది. ఈ డబ్ల్యూపీఎల్ లో 8 మ్యాచుల్లో 13వికెట్ల తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్ విన్నర్ గా కూడా నిలిచింది. అందులో ఫైనల్ లో నాలుగు వికెట్లు సాధించింది. వీటితోపాటు డబ్ల్యూపీఎల్ 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది శ్రేయాంక పాటిల్.
Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said,
“Hi Shreyanka, well bowled.”
He actually knows my name 😬😬😬#StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0— Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024