కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లేడీస్ వాష్‌రూమ్ లో సీక్రెట్ కెమెరా అమర్చి ఆడవాళ్ళ వీడియోలో రికార్డ్ చేస్తున్నాడు ఆ థియేటర్ లో పని చేసే ఓ ఉద్యోగి. వివరాలలో కెళితే బెంగుళూరోని సంధ్య థియేటర్ లో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రీ-రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో థియేటర్‌కు ప్రేక్షకులు భారీగా పోటెత్తారు.
ఈ క్రమంలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ బ్రేక్ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడ ఓ చోట అనుమానాస్పదంగా అమర్చిన సీక్రెట్ కెమెరాను గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేయడంతో థియేటర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. థియేటర్ యాజమాన్యంతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. థియేటర్ సిబ్బందిలో ఒకరిని పట్టుకొని చితకబాదారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, థియేటర్‌లో భద్రతా లోపాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.